మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి కొణిదెల నిహారిక వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ వివాహానికి మెగా కుటుంబం నుంచి అందరు స్టార్ లు వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించారు.. పెళ్లి జరిగి కూడా చాల రోజులవుతుంది.. అయితే కూతురు ను మిస్ అవుతున్నాననే బాధ నాగబాబు లో స్పష్టంగా తెలుస్తుంది.. సోషల్ మీడియా లో దాన్ని వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది ఏ తండ్రికైనా ఉన్న బాధే అయినా నాగబాబు మరి ఎమోషనల్ అయిపోతున్నాడని సోషల్ మీడియా లో నెటిజన్స్ అంటున్నారు..