తెలంగాణ లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న వార్త ప్రజల్లో , కార్యకర్తల్లో కొంత సంతోషం నింపుతుంది.. అయితే ఈ వార్త ప్రతిపక్షాలకు ఏమో కానీ సొంత టీ ఆర్ ఎస్ నేతలకు మాత్రం నచ్చడం లేదనిపిస్తుంది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గరినుంచి కేసీఆర్ పార్టీ కి, రాష్ట్రానికి నాయకత్వం వహించారు.. అయన చెప్పిందే వేదంలా చేశారు నేతలు.. ప్రజలు కూడా కేసీఆర్ కి ఎక్కడ వ్యతిరేకం అవ్వలేదు. అటు కేసీఆర్ కూడా అందరికి ఉపయోగపడే పనులే చేశారు.. కానీ సడెన్ గా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దిగిపోతున్నారని వార్తలు రావడంతో కొంతమంది తెరాస నేతలు, మరికొంతమంది ప్రజలు సంతృప్తి గా లేరని విశ్వనీయ వర్గాల సమాచారం..