భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ.. ఆ రెండు సినిమాలతో గ్లామర్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్నా కియారా కి ఎందుకో ఇక్కడ మరిన్ని అవకాశాలు రాలేదు. దాంతో మళ్ళీ తాను అరంగేట్రం చేసిన బాలీవుడ్ కే వెళ్ళింది. అక్కడ కొన్ని మంచి మంచి సినిమాలు చేసిన ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు రాబోయే చిత్రాలు అయినా హిట్ ఇస్తాయో చూడాలి. తెలుగులో కూడా ఆమెను పలు సినిమాల్లో చేయించాలని ట్రై చేస్తున్నారు..