హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సునీల్ హీరోగా హరీష్ శంకర్ కథతో వేదాంతం రాఘవయ్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. సి చంద్ర మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. మొదట్లో కమెడియన్ గా మంచి పేరున్న సునీల్ హీరో గా మారి మంచి హిట్ లు కొట్టాడు.