రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఈ సినిమా తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోగా అయన మార్కెట్ ఒక్కసారిగా దేశమంతా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా లో చేసిన అందరు నటీనటులు ఏదోవిధంగా లాభపడ్డారు.. ప్రతి క్యారెక్టర్ కి కూడా దేశం మొత్తం పేరొచ్చింది.. వారికి మంచి గుర్తింపు లభించగా ఎక్కడికెళ్లినా వారిని గుర్తు పట్టె విధంగా బాహుబలి సినిమా వారికి పాపులారిటీ తెచ్చిపెట్టింది.