ఒకప్పుడు హీరోలు ఎలా ఉండేవారంటే ఏడాదికి తక్కువలో తక్కువ పది సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా చూసుకున్నారు. అలా ఇండస్ట్రీ లో వారికి ఎక్కువ పనిని ఇస్తూ ముందుకు వెళ్లారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా ప్రతి హీరో దాదాపు పది సినిమాలు రిలీజ్ చేసి హిట్ లు కొట్టి దూసుకెళ్ళేవారు. కానీ రాను రాను సినిమా లో మార్పులు రావడంతో, సినిమా తీసే పద్ధతి మారడంతో సినిమా చేయడానికి లేట్ అవడంతో హీరోలు ఏడాదికి ఒక్క సినిమా ని చేయడమే గగనం అయిపొయింది.