టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్న కీర్తి సురేష్ తాజాగా ఓ సినిమా ద్వారా నెగెటివ్ పబ్లిసిటీ ని దక్కించుకుంటుంది.. ఆ సినిమా టీజర్ లో ఆమెను చుసిన వారంతా ఆమెను తిడుతున్నారు.. మహానటి సినిమా చేసిన నాటివి ఈ రోల్ ఎలా చేసిందని తిట్టిపోస్తున్నారు. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ హిట్ ల మీద హిట్ లు కొట్టి అనతికాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది.. ఆమె నటించిన మహానటి సినిమా కి నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆమె కెరీర్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది..