టాలీవుడ్ లో యాంకర్ గా మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రదీప్ అనిచెప్పాలి.. మోడల్ గా, సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఎన్నో సంవత్సరాలు కష్టపడితేగానీ ఈ స్థాయి రాలేదని చెప్పాలి.. ఎన్నో షో లకు యాంకరింగ్ చేసిన ప్రదీప్ ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంది.. ఈ సినిమా ప్రమోషన్ ని వినూత్న రీతిలో చేసిన ప్రదీప్ తన బుల్లితెర ఫ్రెండ్స్ ని వాడుకుని మంచి హైప్ తీసుకొచ్చాడు.