సూపర్ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమైన హీరోయిన్ అనుష్క.. తొలి సినిమా తోనే ఆమె స్టార్ మెటీరియల్ అని దర్శక నిర్మాతలకు తెలిసిపోయింది. అందుకేనేమో లేట్ చేయకుండా ఆమెకు వరుస సినిమాలు అప్పజెప్పారు.. రాజమౌళి విక్రమార్కుడు సినిమా తో ఆమెకు తిరుగులేకుండా పోయింది.. ఆ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలు రావడం మొదలయ్యాయి.. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరి తో నటించి కొద్దీ సమయంలో టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఇప్పటికీ టాలీవుడ్ లో ఆమె హవా కొనసాగుతుందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.