టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో తెలిసిందే. సినిమాలో వచ్చే హీరోయిన్ హీరో పాత్రలతో పాటుగా వీరి క్యారెక్టర్ లకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు పాపులారిటీ దక్కించుకుంటారు.. వీరికి కూడా ఫ్యాన్స్ ఉంటారు అంటే నమ్మాల్సిందే. తెలుగులో చాలామందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.. వారి వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సంచలన నటి హేమ దర్శకులపై, తనకు తల్లి పాత్ర లు ఇవ్వని వారిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.