టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. పెద్ద హీరో దగ్గరినుంచి చిన్న హీరో దాకా ఆయనంటే గౌరవం ఉంటుంది. మొదట్లో విలన్ గా చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా ఇప్పుడు మళ్ళీ విలన్ గా చేస్తూ బిజీ గా ఉన్నాడు. మధ్య మధ్య లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ ప్రేక్షకుల తనని మర్చిపోకుండా చేసుకుంటున్నాడు.. ఇది చాలదన్నట్లు శ్రీకాంత్ తన కొడుకును కూడా హీరో గా పరిచయం చేశాడు. నిర్మల కాన్వెంట్ సినిమా తో హీరో గా పరిచమైన శ్రీకాంత్ కొడుకు రోషన్ ఆ సినిమా తో పెద్దగా ఎలివేట్ కేలేకపోయాడు..