తెలంగాణాలో బలపడుతున్న బీజేపీ పార్టీ దూకుడు పెంచుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస నేతలను విమర్శలతో దెబ్బ కొడుతుంటే మరోవైపు ఇతర బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కారు పార్టీ లోని నేతలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కానీ విజయం సాధించిన బీజేపీ పార్టీ లో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో డిపాజిట్లు కూడా దక్కవని అనుకున్న పార్టీ కి ఈ లెవెల్లో బలం చేకూరడం అంటే కారు పార్టీ కి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.