సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. ఎప్పుడో చేసిన దాన్ని ఇప్పుడు తలచుకుని దాన్ని త్వీట్ చేసి వైరల్ గా చేయడం ఆయనకు చిటికె లో పని.. రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినా ఇప్పుడు వివాదాస్పద ట్వీట్ ల ద్వారా రోజు ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెడుతూ, ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. దానికి తోడు యూట్యూబ్ ఛానళ్లలో కామెంట్స్ చేస్తూ పాపులర్ అవుతుంటారు. ఈ తరం వారికి రామ్ గోపాల్ వర్మ అంటే దర్శకుడిగా కాకుండా వివాదాస్పద వ్యక్తిగా మాత్రమే తెలుసు..