టాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి భర్త కు గత కొన్ని రోజులుగా దూరంగా జీవిస్తున్న సునీత అభిప్రాయం బేధాల వల్ల ఆయనకు దూరంగా ఉంటుంది. అయితే అవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల పాటు ఆమె సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది. ఏ సెలబ్రిటీ చూసినా ఆమెగురించి మాట్లాడేవారే..