శ్రీదేవి, బోణీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ధఢక్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.. ఆమె నటించిన గుంజన్ సక్సేనా సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. నెట్ ఫ్లిక్స్ లో లాక్ డౌన్ టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇక జాన్వీ నటనకు మంచి కితబొచ్చింది. తొలి సినిమాలోని ఒకటో రెండో లోపాలు ఈ సినిమా తో తుడిచిపెట్టుకుపోయాయి..