సినిమాల్లో హీరోలకి డూప్స్ ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. హీరోయిన్ ల తో రొమాన్స్ కి స్వయంగా వారే యాక్షన్ చేసే హీరోలు ఫైట్స్ లాంటి సీన్స్ కి మాత్రం డూప్స్ ని వాడేస్తూ ఉంటారు. ఏదైతేనం డూప్స్ చేసే సాహసానికి వారు పేరు కొట్టేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని సినిమా ఇండస్ట్రీ లకు డూప్ లను పెట్టుకుని హీరోలు సినెమాలు చేస్తుంటారు. కొంతమంది హీరో లు తామే సాహసం చేయడానికి రెడీ అవుతున్నా కొన్ని రిస్కీ షాట్లను చేసేందుకు చాలా మంది హీరోలు సాహసించరు. అందుకే ఈ డూప్ ల రాక ఎక్కువయ్యింది. అలా మెగా స్టార్ చిరంజీవి కి ముప్పై ఏళ్లుగా ఒకే డూప్ చేస్తున్నారు.