సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా లో ఎప్పటికపుడు తన ఫ్యామిలీ ఫోటో లు పెడుతూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన భర్త లుక్స్ ని, కొడుకు కూతురు అల్లరి చేస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ ప్రేక్షకులను ఎంతో ఉర్రుతలూగిస్తారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తి గా దూరం ఉన్న నమ్రత రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇన్నాళ్లు పిల్లల పెంపకం తోనే సరిపోయి ఆమె సినిమాల్లో నటించడానికి వీళ్ళు పడట్లేదు. ఇప్పుడు వారు పెద్ద వారు అయిపోవడంతో ఆమె సినిమాల్లో మళ్ళీ నటించాలనే డిమాండ్ పెరిగిపోతుంది..