టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్న సాయి పల్లవి ఈమధ్య విచిత్రమైన కోరిక కోరుతుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని కథలు కూడా వింటుంది సాయి పల్లవి. ఈ కాలంలో అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారు.. అలా సాయి పల్లవి ఇండస్ట్రీ కి దొరకడం ఎంతో అదృష్టం.. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..