సినిమా ఇండస్ట్రీ లో వరుసలు పెట్టి పిలవడం చాల తక్కువ.. ముఖ్యంగా నటీనటుల మధ్య పిలుపులు రిలేషన్స్ తో పిలవడం కష్ట సాధ్యమైన పని.. ఎందుకంటే ఏ సినిమాలో ఎలాంటి రిలేషన్ పుట్టుకొస్తుందో ఎవరికీ తెలుసు.. బయట అన్న చెల్లెల్లా ఉన్నవారు సినిమాల్లో భార్య భర్తల వేషం వేయాల్సి వస్తే, అందులోనూ రొమాన్స్ చేయాల్సి వస్తే ఆన్ స్క్రీన్ పై వారి జంట కు మంచి మార్కులు పడవు.. ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు ఓ హీరో హీరోయిన్ లకి వచ్చింది.. ఆ హీరోయిన్ హీరోను అవసరం ఉన్నా లేకున్నా అన్నయ్య అన్నయ్య ని పిలిచేది.. అయితే ఒకసారి ఓ సినిమాలో రొమాన్స్ లో భాగంగా ఆమెపై పడుకుని ముద్దుపెట్టాల్సిన సందర్భం రాగా వారిద్దరూ చాల ఇబ్బంది పడ్డారట..