లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో పెళ్లిళ్ల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత.. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె వివాహం చేసుకున్నారు.. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న ఆమె ఎన్నో ఆశలతో కొత్త అత్తవారింట అడుగుపెట్టింది. టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.. సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు.