ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లందరు ఇప్పుడు బుల్లితెరవైపు చూస్తున్నారు. చాలామంది సీనియర్ హీరోలు సీరియల్స్ లో నటిస్తూ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరికొంతమంది షో లలో చేస్తూ ఏదోలా ప్రేక్షకులకు కనిపిస్తూ వారి తమని మర్చిపోకుండా చేసుకుంటున్నారు.. అంతేకాదు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.. సినిమాలు లేకపోతే ఏం తమకు బుల్లితెర ఉందికదా అనుకుంటూ అక్కడ కూడా పోటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే రోజా, ప్రియమణి, సంగీత, పూర్ణ లాంటి హీరోయిన్ లు బుల్లితెరపై షో లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిలా ఎంట్రీ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు..