లేడీ సూపర్ స్టార్ నయనతారకు సౌత్ లో ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే.. ఆమెకు క్రేజ్ కి తగ్గట్లుగా ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ హిట్ కొడుతుంది. ఓ వైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ మరో వైపు అందరు స్టార్ హీరోలతో సినిమా చేస్తూ సౌత్ లోనే నెంబర్ వన్ లో హీరోగా వెలుగొందుతుంది. సినిమాల పరంగా ఆమె కెరీర్ చాల హై లో ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో ఆమె కు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి.. బ్రేక్ అప్ లు ఆమెను కృంగదీసినప్పటికీ అవి తట్టుకుని నిలబడి ఇంతవరకు వచ్చిందంటే ఆమె ఆత్మధైర్యం కు మెచ్చుకోవాలి.