బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియాంక పెళ్లి చేసుకుని తాను చేసే సినిమాల సంఖ్య తగ్గించుకుంది.. బాలీవుడ్ లో అప్పుడో ఇప్పుడో సినిమా చేస్తూ పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమవుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది.. సినిమాల్లో తాను కనిపించినా, కనిపించకపోయినా ప్రియాంక మాత్రం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది.