సినిమా నిర్మాణ రంగంలో అయినా, డిస్ట్రిబ్యూషన్ లో అయినా, ఒక కొత్త వ్యక్తిని నమ్మి సినిమా ఇవ్వాలన్న దిల్ రాజు కి చాలా ప్రత్యేకత ఉంటుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. అయన నిర్మాణంలో వచ్చిన సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా నైజాం లో రిలీజ్ చేసి డబ్బు గడిస్తుంటారు. ఏ సినిమా నిజం బిజినెస్ అయినా ఈయన చేతుల మీదుగానే జరగాలి.. అయితే కొంతమంది ఆయనపై బురద చల్లాలని చూస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా తనపనేదో తాను చూసుకుంటూ పోతారు.