‘పుష్ప’లో విలన్ పాత్రకు ముందు అనుకున్నది విజయ్ సేతుపతినే. అతణ్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాత్ర డిజైన్ చేశాడు సుక్కు. ముందు సేతుపతి సైతం ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడంలో బాగా ఆలస్యం జరిగింది. దీనికి తోడు కరోనా వచ్చి విజయ్ సేతుపతి చేస్తున్న వేరే సినిమాల షెడ్యూళ్లను దెబ్బ తీసింది. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా ఆ ప్రభావం పడింది. దీంతో ‘పుష్ప’కు డేట్లు సర్దుబాటు చేయలేనంటూ అతను ఈ సినిమాకు దూరమయ్యాడు.