జబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. సుధీర్, రష్మీ.. అనసూయ, ఆది.. ఇలా జబర్దస్త్ లో కొన్ని జంటలు ప్రేక్షకులను మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. ఫ్లర్టింగ్, లైన్ వేయడాలు ఇవి ప్రధానంగా సాగే వీరి మధ్య కామెడీ ఆహ్లాదకరంగా ఉండడం విశేషం.. ఇలా జబర్దస్త్ లో ఈమధ్య పుట్టుకొచ్చిన మరొక జంట వర్ష, ఇమ్యాన్యుయెల్.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందుకే స్కిట్ లలో కూడా అలాంటి పాత్రలే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉన్నట్లు కొన్ని కొన్ని స్కిట్ ల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది..