తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్ షో.. సామాన్యులు గా వచ్చిన వారు ఈ షో లో పాల్గొని ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. ఎన్ని షో లు వచ్చిన తనకు ఎదురులేదని నిరూపిస్తూ వచ్చింది. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లే కాకుండా యాంకర్ లు కూడా సెటిల్ అయిపోయారని చెప్పొచ్చు..