ఈమధ్య సినీ ఇండస్ట్రీ లో అలనాటి తారల రీ ఎంట్రీ లు ఎక్కువవుతున్నాయి.. అప్పుడు కొన్ని సినిమాలు చేసినా, లేదా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తారలు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దర్శకులు కూడా వారిని మళ్ళీ నటింపచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇలాంటి దర్శకులలో త్రివిక్రమ్ ముందు ఉంటారు. అయన ప్రతి సినిమాలో ఒక లేడీ క్యారక్టర్ ని సృష్టించి ఆ పాత్ర కు ఒక ఓల్డ్ హీరోయిన్ ని దించుతుంటారు.. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి లో ఖుష్భు, సన్నాఫ్ సత్యమూర్తి లో స్నేహ, మొన్నటి అలవైకుంఠపురంలో టబు ఇలా అయన ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ఉండాల్సిందే..