సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా పుష్ప.. టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సుకుమార్ రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ హిట్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా చేయడంతో అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి..