ప్రస్తుతం వెంకీ తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నారప్ప మూవీతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3లో కూడా నటిస్తున్నాడు. అయితే ఎఫ్2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆగష్టులో థియేటర్లోకి రానుందని ఇప్పటికే చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు.దాంతో వెంకీ యువదర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో ఓ సినిమా ఉంటుందనే వార్తలు గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తుంది. ఇదివరకే ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుందని పుకార్లు కూడా వచ్చాయి.