ప్రభాస్ కి నేషనల్ లెవెల్ లో క్రేజ్ ఉండడంతో సలార్ సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి.. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకు మోహన్ లాల్‌ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రభాస్-లాల్ కాంబినేషన్ ఓకే అయితే అంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు. కాగా ఇప్పుడు ‘సలార్’ కథానాయిక విషయంలోనూ ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని ఈ చిత్రంలో ప్రభాస్‌తో జోడీ కట్టనుందట.