సినిమాలతో పాటు నభా నటేష్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోలతో అలరించడమే కాకుండా.. నిత్యం తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.తాజాగా నభా నటేష్ తన ఫాలోవర్లతో ఓ ఆట ఆడింది. మీరు ఏదైనా అడగండి.. అది నిజమా? కాదా? అని చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ట్రూ ఆర్ ఫాల్స్ ఆటలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడిగారు. మీకు దెయ్యాలంటే భయమా? కాఫీ అంటే ఇష్టమా?.. లవ్లొ ఉన్నారా? అంటూ వెరైటీ ప్రశ్నలు అడిగారు.