దేశంలోని సినిమా ఇండస్ట్రీ లలో ప్రధానంగా ఉన్న సమస్య కాస్టింగ్ కౌచ్..ఈ సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ద్వారా చాలామంది అమ్మాయిలు నష్టపోతున్నారని ఈమధ్యే తెలుస్తుంది.. పెద్ద ఎత్తున హీరోయిన్ లు, ఆర్టిస్ట్ లు ఈ కాస్టింగ్ కౌచ్ పైన గళాలు విప్పుతున్నారు.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. గతంలో లేని ఇప్పుడు వచ్చిందంటే వారు ఎంతటి బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో సొసైటీ గురించి, పరువు, మర్యాదల గురించి ఆలోచించినా ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నారు..