ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సోషల్ మీడియా లో ఎదో ఒక వార్తతో ట్రేండింగ్ లో నిలుస్తుంది. తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక పెళ్లి తర్వాత హాలీవుడ్ కే ఎక్కువగా పరిమితమైపోయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నాహాలీ వుడ్ నుంచే ఆమె సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసి హాలీవుడ్ లో కూడా చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్..