థ్రిల్లర్ సినిమాలను వెరైటీ గా తెరకెక్కించి తనకంటూ స్టైల్ ఏర్పరుచుకున్న నటుడు రవిబాబు.. నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అయన ఇటీవలే అదుగో సినిమా ని ఓ పందిపిల్ల ఆధారంగా చేసి ఇండస్ట్రీ లో ఎవరు చేయని ప్రయోగం చేసి హిట్ కొట్టాడు. సీనియర్ నటుడు చలపతి రావు తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన రవిబాబు మొదట్లో విలన్ వేషాలు, ఆ తర్వాత కామెడీ పాత్రలు చేసేవారు. తర్వాత దర్శకుడిగా మారారు. అల్లరి సినిమా తో దర్శకుడిగా మారారు రవిబాబు. ఆ తర్వాత అనసూయ, అమరావతి వంటి థ్రిల్లర్ చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడిపోయారు..