ఒక సాధారణ హీరో స్టార్ అవ్వడానికి ఒక్క సినిమా చాలు.. ఒక్క స్టార్ మెగా స్టార్ అవ్వాలంటే పది సినిమాలైనా సూపర్ హిట్ అందుకోవాలి.. అప్పుడే ఆ హీరో కి జనాల్లో క్రేజ్ పెరిగిపోయి సూపర్ స్టార్ అవుతాడు. కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు చేసినా ఆ తర్వాత స్టార్ అవడానికి మంచి సినిమాలు, క్రేజ్ పెరిగిపోయే సినిమాలు చేయాలి. అలా హీరో సురేష్ కెరీర్ మొదట్లో కొన్ని పాత్రల్లో నటించిన హీరో గా ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. అప్పట్లో అంతటి అందంగా ఉన్న హీరోలు చాలా తక్కువే.. తెల్లగా, ముద్దుగా సురేష్ స్క్రీన్ పై కనిపించే సరికి ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు..