నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేయబోతున్నాడు. వీరి కలయిక లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఆ చిత్రంలోని బంగార్రాజు పాత్ర ని టైటిల్ గా పెట్టి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ పలు సినిమాలకు అంగీకరించారని తెలుస్తుంది..