టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదల అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. పూరి జగన్నాధ్ విజయ్ కలయిక పై వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బాలీవుడ్ లో కూడా బాగానే రాణిస్తుందని అనుకుంటున్నారు..