తెలుగు సినిమాలకు విలన్ అంటే ఇప్పుడు అందరికి ఒక్కరే గుర్తుకొస్తున్నాడు విజయ్ సేతుపతి.. ఇటీవలే మాస్టర్ సినిమా లో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఉప్పెన సినిమా లో కూడా అలాంటి రోల్ ని ప్లే చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయితే విజయ్ సేతుపతి టాలీవుడ్ లో పాతుకుపోయినట్లే అని చెప్పాలి.. తెలుగు లో చేసి ఒకటి రెండు సినిమాలతోనే విజయ్ ఇంత పాపులారిటీ సంపాదించాడంటే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా పెద్ద స్టార్ అయినా అయిపోవచ్చు.. అయన పూర్తి స్థాయిలో నటించిన సినిమా రిలీజ్ కానే లేదు అప్పుడే ఆయనకు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ గా అవకాశాలు వస్తున్నాయి..