ఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్..ఆ సినిమా లో అందంతో పాటు అభినయం కూడా పండడంతో అభిమానులు ఆమెను బాగానే రిసీవ్ చేసుకున్నారు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో , చక్కని అభినయంతో, సూపర్ గ్లామర్ తో , చాలా యాక్టివ్ గా సినిమా లో కనిపించి అల్ రౌండర్ గా అందరి హృదయాలను కట్టిపడేసింది.. నాగ చైతన్య సవ్యసాచి సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ కి మొదట్లో అవకాశాలు వచ్చిన హిట్ లు మాత్రం పడలేదు. అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా ఎందుకో సరిగ్గా ఆడలేదు. కానీ తనలోని టాలెంట్ ని గుర్తించిన పూరి జగన్నాధ్ ఆమెకు ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ ఇచ్చాడు.