ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పాయల్ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఆ సినిమా అనంతరం అమ్మడు మళ్ళీ అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చాయి కానీ ఆమె కెరీర్ కు యూ టర్న్ ఇచ్చే హిట్టు పడలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. గత ఏడాది ఆమె ఎక్కువగా నమ్మకం పెట్టుకొని చేసిన చిత్రం డిస్కో రాజా.