ప్రముఖ నటుడు, నిర్మాత అయినా సురేష్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీ కి ఎంటర్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో , అందం, అభినయం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి అనుకున్నారు.. అందుకు తగ్గట్లే ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి.. తొలి సినిమా చేసి కొన్ని రోజుల్లోనే నేను లోకల్ లాంటి సినిమా చేసి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది..