మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చి మంచి మార్కులు కొట్టేసింది.. కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో ఉప్పెన మంచి కలెక్షన్లను రాబడుతుంది. తొలి రోజు మంచి వసూళ్లను సాధించిన ఉప్పెన రెండో రోజు కూడా అదే రికార్డు స్థాయి వసూళ్లను కొనసాగించింది.. ఓవరాల్ గా వైష్ణవ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ తో పాటు మంచి వసూళ్లను కూడా దక్కించుకుంది.. డెబ్యూ సినిమా నే ఈ రేంజ్ లో ఉండడంతో వైష్ణవ్ తేజ్ మంచి సినిమా తోనే డెబ్యూ చేశాడని అందరు చెప్పుకుంటున్నారు..