రామ్ చరణ్ తేజ్ ఓ వైపు RRR సినిమాలో నటిస్తూనే మరోవైపు తన తండ్రి ఆచార్య సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అది చాలదన్నట్లు ఆ సినిమా లో ఓ కీలక పాత్ర లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమాలోని తన లుక్ కూడా రిలీజ్ కాగా మెగా ఫ్యాన్స్ ఆ లుక్ కి మంచి స్పందన అందించారు. ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్ శంకర్ తో తన చిత్రాన్ని ప్రకటించేశారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.. కొన్ని రోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వస్తుండగా ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో సినిమా పై అభిమానులు ఇప్పటినుంచే మంచి అంచనాలు పెట్టుకున్నారు..