రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ప్రభాస్ నుంచి సాహో సినిమా వచ్చి చాల రోజులే అయిపొయింది.. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సినిమా ని తొందరగా విడుదల చేసి గ్యాప్ ఎక్కువ లేకుండానే అయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేశాడట.. ఇప్పటికే షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది.. ఇక జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధే శ్యామ్ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది.