మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మరో కథానాయకుడు కాగా పాన్ ఇండియా చిత్రం గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బాహుబలి తో రాజమౌళి టాలీవుడ్ స్టామినా ని చాటిచెప్పగా ఈ సినిమా తో మరో లెవెల్ కి తీసుకెళ్తాడు అంటున్నారు. పైగా మల్టీ స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.. ఇక రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా నే కాకుండా తన తండ్రి ఆచార్య సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. అది చాలదన్నట్లు ఆ సినిమా లో ఓ కీలక పాత్ర లో కూడా నటిస్తున్నాడు.