టాలీవుడ్ లో బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. గత నాలుగు సీజన్ లు గా ఈ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అందులోని కంటస్టెంట్ లు ఇప్పుడు సెలెబ్రిటీలుగా మారిపోయారు. బిగ్ బాస్ కి ముందు తర్వాత అన్నట్లు వారి సినీ జీవితం తయారైంది. నార్మల్ వ్యక్తుల్లా వచ్చిన వారు కూడా సెలబ్రిటీ హోదాలో ఉంటూ మంచి మంచి అవకాశాలు సంపాదిస్తున్నారు.. ఇక ఒక్కో సీజన్ కు ఒక్కో హోస్ట్ వ్యవహరించగా గత రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ చేశారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేసి ప్రేక్షకులను అలరించారు.