పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు..