టాలీవుడ్ లో ఉప్పెన ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. దీంతో ఇప్పటివరకు అల్ టైం డెబ్యూ హీరో గా రికార్డులకెక్కాడు.. ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..