ఇష్క్ సినిమా తో మళ్ళీ కమ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకుని ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా కూడా అయన గత సినిమాల్లాగా హిట్ చేయాలనీ చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తో పాటె చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా ని చేశాడు నితిన్. టాలీవుడ్ లో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ఐతే సినిమా తో తొలి సినిమా తోనే వెరైటీ కాన్సెప్ట్ అందించిన ఈ దర్శకుడు గోపీచంద్ సాహసం సినిమా తో కమర్షియల్ దర్శకుడిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు..